Breaking News

బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక

బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. పోయిరా బతుకమ్మ ఉయ్యాలో అంటూ

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

మండలంలో ఘనంగా సద్దుల బతుకమ్మ ఆట పాట

నర్సంపేటలో ఘనంగా ఆర్ఎస్ఎస్ పథసంచలన్

మనప్రగతిన్యూస్ /పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. పోయిరా బతుకమ్మ ఉయ్యాలో అంటూ  మహిళలు పాటలు పాడుతూ తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మను మండలంలోని అన్ని గ్రామాల్లో
సోమవారం  ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి పాలకుర్తిలోని ఊర చెరువు వద్ద మహిళలందరితో కలిసి ఆడి పాటలు పాడారు. తొమ్మిది రోజుల బతుకమ్మ సద్దుల బతుకమ్మను ఆడపడుచులు తంగేడు పూలతో పాటు రంగురంగుల పూలతో పేర్చి మహిళలు చిన్న పిల్లలు కొత్త బట్టలు ధరించి బతుకమ్మను నిమజ్జనం చేయడానికి చెరువు వద్దకు తీసుకెళ్లారు .తెలంగాణ సంస్కృతి సంప్రదా
యాలు ఉట్టిపడే విధంగా పాటలు కోలాటాలతో మహిళలు సంబరాలు జరుపుకున్నారు. సందర్భంగా ఎమ్మెల్యే యశస్విరెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. పాలకుర్తి ఊర చెరువు వద్ద బతుకమ్మ ఆడేందుకు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ నుండి చెరువు వరకు తాత్కాలిక స్తంభాలు ఏర్పాటు చేసి వద్యుత్ ల్తెట్లును ఏర్పాటు చేశారు. బతుకమ్మ  ఆడే ప్రాంతమంతా  ఫ్లడ్ లైట్ల ఏర్పాటు చేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో చెరువుల వద్ద ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు మహిళలు బతుకమ్మ ఆడేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎస్ఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.