మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి
మండలంలో తెలంగాణ ఆడపడుచులు ఎంతో వైభవంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ ఉత్సవాలు గజిబిజిగా మొదలయ్యాయి. అష్టమి తిది సోమవారం, మంగళవారం రెండు రోజులు ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం సద్దుల బతుకమ్మను మంగళవారం జరుపుకోవాలని సూచించగా మండలంలోని చుట్టుపక్కల గ్రామాలు మేడపల్లి, గాంధీ నగరం, రుద్రగూడెం, వల్లే నరసయ్య పల్లె, నరక్కపేట, శనిగరం గ్రామాలు సోమవారం జరుపుకున్నాయి. ఈ సందర్భంగా అధికారులు బతుకమ్మ ఆడుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయగా మహిళలు భక్తి శ్రద్ధలతోఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. చెరువుల వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎస్సై గోవర్ధన్ ఆధ్వర్యంలో పోలీసు బృందం తగు జాగ్రత్తలు తీసుకున్నారు.మండలం కేంద్రంతోపాటు మిగతా గ్రామాలు మంగళవారం జరుపుకోనున్నాయి.
