మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతజయంతిని పురస్కరించుకొని
నర్సంపేట నగరంలో ఆదివారం ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు నిర్వహించిన పథసంచలన్ (కవాతు) నగరవాసులను విశేషంగా ఆకర్షించింది. నెక్కొండ, చెన్నారావుపేట, నర్సంపేట, ఖానాపురం మండలాల స్వయంసేవకులు పాల్గొన్నారు. రూట్ మార్చ్ వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ కవాతులో ఆర్ఎస్ఎస్ ఘోష్ బృందం (బ్యాండ్ బృందం) వాయిద్యాలను మ్రోగిస్తూ ముందు నడుస్తుండగా మధ్యలో పూలతో అలంకరించిన జీపుపై భరతమాత, డాక్టర్ జీ, గురూజీ చిత్రపటాలతోపాటు భగవద్వజాన్ని (కాషాయ జెండా) ఉంచి వెనక పూర్తి గణవేష(యూనిఫామ్) ధరించిన స్వయంసేవకులు ఒక క్రమ పద్ధతిలో, లయబద్ధంగా కవాతు చేస్తూ నడుస్తున్న తీరు చూపర్లను ఆకట్టుకుంది. దారి పొడవునా స్థానికులు, మహిళలు భగవాద్వజంపై పూలు చల్లుతూ మంగళహారతి పట్టారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నర్సంపేట సంఘచాలక్ మోతే సమ్మీ రెడ్డి, విభాగ్ ప్రచారక్ విఘ్నేశ్వర్ మరియు గణవేషధారి స్వయం సేవకులు తదితరులు పథసంచలనంలో పాల్గొన్నారు.
