Breaking News

ప్రధాని నరేంద్ర మోడీ (మనసులోని మాట) “మన్ కి బాత్” 126 ఎపిసోడ్ ను వీక్షించిన బాజాప శ్రేణులు

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

మన్ కీ బాత్ కన్వీనర్ కాసుల నాగేంద్ర బాబు ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి బిజెపి నాయకులతో కలిసి మన్ కి బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. దేశ ప్రజలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ “మన్ కీ బాత్” కార్యక్రమం ద్వారా ఆత్మీయంగా సంభాషించారనీ,ఈ సందర్భంగా ఆయన దేశ అభివృద్ధి, సాంకేతిక ప్రగతి, యువత పాత్ర, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ భారత్ కార్యక్రమం, మహిళా సాధికారత వంటి పలు కీలక అంశాలపై తన ఆలోచనలు పంచుకున్నారు.ప్రధాని సాధారణ ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలు, సూచనలు తెలుసుకుంటూ, స్ఫూర్తిదాయక కథనాలను పంచుకోవడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు దేశ అభివృద్ధిలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
“మన్ కీ బాత్” ద్వారా ప్రధాని దేశ యువతకు, రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, శాస్త్రవేత్తలకు, వ్యాపారవేత్తలకు, కార్మికులకు ప్రోత్సాహం అందజేస్తూ, భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజలలో దేశభక్తి, సేవా భావం, సామాజిక బాధ్యతా స్పూర్తిని పెంపొందించే వేదికగా నిలుస్తోందనీ,కార్యక్రమ అనంతరం వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ సీనియర్ నాయకులు కూనమల్ల పృథ్వీరాజ్, వరంగల్ జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, మాజీ యువ మోర్చా నియోజకవర్గ కన్వీనర్ జూలూరి మనీష్ గౌడ్,నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శులు కందికొండ శ్రీనివాస్, సూత్రపు సరిత, రూరల్ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి రాము, పట్టణ ఉపాధ్యక్షుడు ఠాకూర్ విజయ్ సింగ్, యువ మోర్చా జిల్లా నాయకులు శ్రీనివాస్, చిలువేరి అన్వేష్, కార్యదర్శి అశోక్, శోభన్, రఘు, గట్ల సాయి, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.

నర్సంపేటలో ఘనంగా ఆర్ఎస్ఎస్ పథసంచలన్