Breaking News

మోడల్ స్కూల్ విద్యార్థులకు వృత్తి విద్య పై శిక్షణ కార్యక్రమం

ప్రిన్సిపాల్ దీన సుజాత

మన ప్రగతి న్యూస్ నల్గొండ/వేములపల్లి

నర్సంపేటలో ఘనంగా ఆర్ఎస్ఎస్ పథసంచలన్

స్థానిక వేములపల్లి మోడల్ స్కూల్ కళాశాల విద్యార్థులకు వృత్తివిద్యపై పది రోజులపాటు వృత్యంతర శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మోడల్ స్కూల్ కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ దసరా సెలవులు పురస్కరించుకొని వృత్తి విద్య పట్ల అవగాహన కొరకు ఎంబీఏ మార్ట్ సూపర్ మార్కెట్ మిర్యాలగూడ నందు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఒకేషనల్ టీచర్ పి. రమేష్ మాట్లాడుతూ ఈ సెలవు దినాలలో ప్రత్యేక శిక్షణ తీసుకోవడం ద్వారా విద్యార్థులలో వృత్తివిద్యపై నైపుణ్యం మరింత పెంపొంది సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు.
ఇందులో భాగంగానే విద్యార్థులకు 10 రోజులపాటు వృత్యంతర శిక్షణ అందినట్లు తెలిపారు.శిక్షణ అనంతరం సర్టిఫికెట్స్ ఇవ్వబడతాయని అన్నారు. వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో మోడల్ స్కూల్ కళాశాల ప్రిన్సిపల్ ఒకేషనల్ టీచర్పి.రమేష్ ,విద్యార్థీ,విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.