Breaking News

పోయి రావమ్మ పోయి రావమ్మ మా తల్లి గౌరమ్మ

బొడ్డెమ్మను నిమర్జనం చేసిన మహిళలు

సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు

మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గుంటి రజిని

మహిళా అధ్యక్షురాలు గుంటి రమ

నర్సంపేటలో ఘనంగా ఆర్ఎస్ఎస్ పథసంచలన్

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

నర్సంపేట పట్టణంలోని గంగపుత్ర వీధిలో బొడ్డెమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజని ఆధ్వర్యంలో మహిళలంతా కలిసి జరుపుకున్నారు. బతుకమ్మ పాటలతో కోలాటం ఆడుతూ ఘనంగా జరుపుకున్నారు. దీప దూప నైవేద్యాలతో బొడ్డెమ్మను తొమ్మిది రోజులపాటు భక్తి ప్రవృత్తులతో పూజలు చేసి తమ కుటుంబాలు, సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి సంతోషంగా ముఖ్యంగా యువతులు తమకు మంచి తోడు దొరకాలని తమ జీవితం సుఖ సంతోషాలతో వెలగాలని కోరుకున్నారు.ఈ సందర్భంగా పట్టణ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గుంటి రజిని, గంగపుత్ర మహిళ అధ్యక్షురాలు గుంటి రమ లు మాట్లాడుతూ అనాదిగా వస్తున్న మన సాంప్రదాయాన్ని మన ఆచారాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై , ముఖ్యంగా మహిళలపై ఉందని అన్నారు. తొమ్మిది రోజులు ఎంతో ఆర్భాటంగా ఉత్సాహంగా బొడ్డెమ్మ వేడుకలను నిర్వహించుకున్నామని, ముగ్గులతో అలికి,పుట్టమన్ను తెచ్చి ఐదు అంతస్తులతో ఆలయాన్ని పేర్చి దానిపై గౌరమ్మ నిలిపి తీరోక పూలతో అలంకరించి గౌరమ్మ ను భక్తి ప్రవృత్తులతో కోలాటం పాటలు పాడుతూ తొమ్మిది రోజులు పూజించామని, అనంతరం మళ్ళీ రావమ్మా పోయి మళ్ళీ రావమ్మా అంటూ బోడ్డమ్మను మాదన్నపేట చెరువులో నిమజ్జనం చేశామని తెలిపారు.
భక్తులంతా వెంట రాగ చెరువులో నిమజ్జనం చేసిన అనంతరం నైవేద్యాలను ప్రసాదంగా స్వీకరించి గౌరమ్మ కృపకు పాత్రులు అయ్యామని వచ్చే సంవత్సరం బొడ్డెమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా బొడ్డెమ్మ వేడుకలు నిర్వహించుకుంటున్నామని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతల రేఖ, మేధరబోయిన శైలజ, తుంగతుర్తి సునీత, అంకాల రాణి,అంబటి రజని, అనుమాండ్ల అనురాధ, లక్ష్మి, రుద్ర, మాధురి,అమూల్య, దీప, సంధ్య, గౌతమి, సత్య, మాధవి,రవళి,అనూష,అర్చన, సరళ, రాధా తదితరులు పాల్గొన్నారు.