బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
భక్తి

బుద్ధవనం ను సందర్శించిన ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్

బుద్ధవనం ను సందర్శించిన ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి

అంతర్జాతీయ పర్యాట కేంద్రం నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని బుధవారం రోజు తెలంగాణ రాష్ట్రం ఎస్టీ ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న తర్వాత నాగార్జునసాగర్ కి చేరుకున్నారు. నాగార్జున సాగర్ సందర్శనలో భాగంగా లాంచీలో సాగర్ జలాశయంలో పర్యటించిన అనంతరం, నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్ ను, ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం బుద్ధవనం చేరుకున్న చైర్మన్ బృందానికి బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్రలు స్వాగతం పలికారు. అనంతరం బుద్ధ చరిత వనములోని బుద్ధుని పాదాల వద్ద వందనం సమర్పించారు. ఆ తర్వాత బుద్ధ చరిత వనం, ధ్యానవనం, స్థూపవనం, మహాస్థూపాన్ని వీక్షించారు. మహా స్థూపం లోని లోని ధ్యాన మందిరంలో కొద్దిసేపు గడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుద్ధ వనం మహా అద్భుతంగా ఉందని ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిన ప్రదేశం అన్నారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ బుద్ధవనం విశేషాలను వివరించారు. వీరితోపాటు ఎస్ టి ఎస్ సి కమిషన్ సభ్యులు కుసురం నీలాదేవి ,రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణ ,శంకర్ నల్గొండ జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ పిడి కోటేశ్వరరావు, స్థానిక ఎస్సై సంపత్ గౌడ్, ప్రోటోకాల్ ఆర్ ఐ దండా శ్రీనివాసరెడ్డి, నిరంజన్ తదితరులు ఉన్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు