మన ప్రగతి న్యూస్/
హుజురాబాద్:
హుజురాబాద్, జమ్మికుంట పాత తాలుకాల గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలకు చెందిన ఐఓసియల్ (ఇండేన్) గ్యాస్
అంబుజా గ్యాస్ ద్వారా సిలిండర్లు పొందుతున్న వాడకం దారులకు ప్రభుత్వం ద్వారా అందించే గ్యాస్ రాయితీ పొందేందుకు ఈకేవైసి మేళ కార్యక్రమాన్ని 13వ తేది గురువారంనుండి మార్చి 31వ తేదీవరకు హుజూరాబాద్ అంబుజా గ్యాస్ ఏజన్సీ కార్యాలయాంలో నిర్వహిస్తున్నట్లు గ్యాస్ ఏజన్సీ అధినేత, తెలంగాణ యల్పీజి డీలర్ల అధికార ప్రతినిధి పి.వి.మదన్ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు.
కస్టమర్లు తమ ఆధార్,గ్యాస్ పేపర్ జిరాక్స్ ప్రతులను తనవెంట తెచ్చకొని ఈకేవైసి చేసుకోవాలని సూచించారు.
రోజు ఉదయం ఎనమిది గంటలనుండి ఒంటి గంటవరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన వివరించారు.కస్టమర్ నేరుగా ఈకేవైసి చేసుకునేవారు Indianoil.co.in సైట్ సందర్శించి mylpg.in ద్వారా ఈకేవైసి చేసుకునే అవకాశం కల్పించబడింది.
దైనందిన జీవితంలో బాంకింగ్ ఇతర కార్యక్రమాలకు ఈకేవైసి ఎంత ముఖ్యమో యల్పీజి వాడకంలో కూడా అంతే ప్రాధాన్యత వుందని వివరించారు.
ఐదు సంవత్సరాలకు మించి సురక్ష రబ్బరు ట్యూబులు వాడుతున్న వారు విధిగా సురక్ష రబ్బరు ట్యూబులు మార్చుకోవాలని వాటి కాలపరిమితి ఐదు సంవత్సరాల ని పేర్కొన్నారు.
సురక్ష రబ్బరు ట్యూబుపై తయారీ తేది కాలపరిమితి తేది ముద్రించబడి వుంటాయని వాటిని గమనించాలని కస్టమర్లను కోరారు.కాలం చెల్లిన నాణ్యత ప్రమాణాలు లేని రబ్బరు ట్యూబులు వాడడం వలన జరిగే ప్రమాదాలకు ఇన్స్యూరెన్స్ వర్తించదని తెలిపారు.
అదేవిధంగా గ్యాస్ లీకేజి వల్ల మంటలు చెలరేగినప్పుడు నియంత్రించేందుకు ఫైర్ బాల్స్ ఐఓసియల్ అందుబాటులోకి తెచ్చిందని ఇరవైనాలుగు వందల విలువ గల ఈ పరికరాన్ని వేయి రూపాయలకు అందిస్తున్నామని మదన్ మోహన్ తెలిపారు.
ఐదు సంవత్సరాల వారంటి భీమా సౌకర్యం వుందన్నారు