Breaking News

చిప్పలపల్లి గ్రామంలో బర్రెల షెడ్డు పూర్తి దగ్ధం

_ ప్రభుత్వం ఆదుకోవాలి రైతు ఆవేదన

మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్

ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో పాడి రైతు కిరల్ల వెంకటేష్ .
బర్రెల షెడ్డు లో ప్రమాదవశాత్తు మంటలు చిలరేగి షెడ్డులో మూడు పాడి బర్రెలు దొడ్డి సగం వరకు కాలడంతో రైతు తండ్రి రాజయ్య బర్రెల షెడ్డు వద్ద ఉండడంతో షెడ్డులో బర్రెలను కాపాడి చుట్టుపక్క రైతులు గ్రామస్తులు వచ్చి మంటలు ఆర్పగా అప్పటికే షెడ్డు పూర్తిగా కాలిపోయింది. కాలిన బర్రెలకు కరీంనగర్ డైరీ అత్యవసర వైద్య అంబులెన్స్ సంఘటన స్థలానికి చేరుకొని పూర్తిగా కాలిన బర్రెలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం


సందర్భంగా రైతు వెంకటేష్ మాట్లాడుతూ ఉదయం షెడ్డు వద్దకు వచ్చి వాటికి నీళ్లు పెట్టి వెళ్లి వచ్చేసరికి బర్రెల షెడ్ పూర్తి కాలిపోయిందని దాంట్లో ఉన్న వస్తువులు మిషిన్లు దానా సంచులు సగం వరకు బర్రెలు గాయాలతో కాలాయని ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే పాడి రైతులు ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.