Breaking News

కృషి విజ్ఞాన కేంద్రం వైరాలో అధిక సాంద్రత పద్ధతిపై కిసాన్ మేళ

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్

ఖమ్మం జిల్లా వైరా లోని
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కెవికె, నందు బుధవారం అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు మీద కిసాన్ మేళ జరిగింది . ఈ కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తలు అధిక సాంద్రత పత్తిలో యాజమాన్య పద్ధతులు, వరికి ప్రత్యమ్నాయంగా యాసంగిలో వేసుకునే పంటలు మరియు అపరాల,పంటలపై మామిడి, ఆయిల్ ఫామ్, తోటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి, జిల్లాలో ప్రస్తుతం పశువులకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సలహాలు సూచనలు చేశారు
అదేవిధంగా నూతన పద్ధతులు సాంకేతికపై వ్యవసాయ ప్రదర్శన రైతుల సందర్శన కోసం వివిధ కంపెనీల స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది .

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం


ఈ కార్యక్రమంలో
పత్తి ప్రధాన శాస్త్రవేత్త వీరన్న, వరి ప్రధాన శాస్త్రవేత్త
వెంకన్న, శాస్త్రవేత్త ఓం ప్రభాకర్, అపరాల ప్రధాన శాస్త్రవేత్త కే రుక్మిణి దేవి , జిల్లా ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్, పశు వైద్య శాఖ ఏ డి ఏ రమణి, ప్రొఫెసర్ ఐ వీ శ్రీనివాసరెడ్డి, మధిర సహాయ సంచాలకులు ఎస్ విజయ్ చంద్ర, వైరా సహాయ వ్యవసాయ సంచారకులు కరుణ శ్రీ, ప్రోగ్రాం కోఆర్డినేటర్ కే రవికుమార్, శాస్త్రవేత్తలు వి చైతన్య, ఫణీ శ్రీ, విశ్వవిద్యాలయ పరిశోధన విస్తరణ సలహా సంఘ నెంబర్ రాణా ప్రతాప్ ,
ఏన్కూర్ మండల వ్యవసాయ అధికారి నరసింహారావు, వ్యవసాయ విస్తరణ అధికారులు బాలకృష్ణ, శ్రీకాంత్, అశోక్, లహరి, నవ్య, భవ్య శ్రీ, కె వి కె సిబ్బంది,రైతులు పాల్గొన్నారు