మన ప్రగతి న్యూస్/హత్నూర:
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం షేర్ ఖాన్ పల్లి గ్రామ శివారులో వెలసిన శ్రీ పలుగు పోచమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈనెల 23 నుంచి 25 వరకు జరగనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మల్లా గౌడ్ తెలిపారు. బుధవారం ఆలయం వద్ద జాతర గోడ పోస్టర్ లను ఆవిష్కరించారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 23వ తేదీన అమ్మవారికి ప్రత్యేక పూజలు రేణుక ఎల్లమ్మ కళ్యాణోత్సవం జరుగుతుందని, 24న అగ్నిగుండాలు బోనాలు, 25న బండ్లు తిరుగుతాయని చైర్మన్ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమ్మవారి జాతర బ్రహ్మోత్సవాలను అత్యంత వైభపితంగా నిర్వహించనున్నట్లు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సీఈవో దేవనాలు, ధర్మకర్తలు దశరథ్, లక్ష్మా గౌడ్, స్వామి, శంకరయ్య, స్వరూప, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.