_ డైరెక్టర్ జెల్లా వెంకటస్వామి
మన ప్రగతి న్యూస్ / రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాపర్
హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ ద్వారా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లో ఒక నెల నాన్ రెసిడెన్షియల్ ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రాం ఇవ్వనున్నట్లు హైదరాబాద్ లోని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీ డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు, ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత ప్రైవేట్ బ్యాంకుల్లో ప్లేసుమెంట్ కల్పిస్తారు.డిగ్రీ పూర్తయి 26 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులు 15.03.2025 నుండి 08.04.2025 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు పై శిక్షణ కార్యక్రమానికి బీసీ అభ్యర్ధులు అర్హులు. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ను తేదీ 12.04.2025 నాడు, ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు.అర్హులైన అభ్యర్థులు 15.03.2025 నుండి 08.04.2025 వరకు www.tgbcstudycircle.cgg.gov.in ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తును సమర్పించవచ్చు. అభ్యర్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2.00 లక్షల లోపు ఉండాలి. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ లో వచ్చిన మార్కుల ఆధారంగా (30) మంది అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఇట్టి సదవకాశాన్ని నిరుద్యోగులు ఉపయోగించు కోవాలని రాజన్న సిరిసిల్ల డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి కోరారు. మరింత సమాచారం కొరకు 040-29303130,9381888746 నంబర్లను సంప్రదించవచ్చు అని కోరారు.