మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పర్యటనలో భాగంగా బుధవారం నాగార్జున సాగర్ జెన్కో అధితి గృహం నకు విచ్చేయటం జరిగింది. ఆయనతో పాటు జిల్లా కమీషన్ మెంబర్లు శంకర్, రాంబాబు నాయక్ లు ఉన్నారు.ఆయను స్థానిక మాదిగ సోదరులు వారిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించటం జరిగింది. తదనంతరం తెలంగాణ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్న దాడులు, అంటరాని తనం, దళిత మహిళల మీద మానభంగాలు చేసేవారిని కఠినంగా శిక్షించేటట్లు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయనను కోరారు.
ఈ యొక్క కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారి గంటా శ్రీనివాసరెడ్డి ,నకుల్ రావు, పోలిపోగు రాజు ,బద్రి ,మంద రఘువీర్ ,అలిపురి శ్రీను పుల్లారావు ,నాగార్జున ,మోసెస్, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.