మన ప్రగతి న్యూస్/ ఖమ్మం టౌన్ :

మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మంలో షి “కారు “చేశారు. పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నూతనంగా కొనుగోలు చేసిన ఫార్చునర్ కారును ఆదివారం ఉదయం పొంగులేటి ఆవిష్కరించారు. అనంతరం ఆ కారును స్టార్ట్ చేసిన మంత్రి సరదాగా నడుపుతూ ఎన్టీఆర్ సర్కిల్ వరకు వచ్చారు. పొంగులేటిని అనుసరిస్తూ ఆయన కాన్వాయ్ వెనకనే వచ్చింది. కారు దిగాక పాయంకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియపరు. అక్కడినుంచి తన కాన్వయలో ఇల్లందు పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
