Breaking News

డిజిలి అయిపోయి ఆగిపోయిన ఆర్టీసీ బస్సులు

  • వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఈ సంఘటన జరగడం సోంచనీయం
  • బస్సులపై ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణ కరువు
    మన ప్రగతి/ వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రంలో డిజిల్ లేక బస్సులు ఆగిపోయిన సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకోవడం సోంచనీయమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం… వికారాబాద్ నుండి పరిగి వెళ్లే రూట్ బస్సులలో కలెక్టర్ కార్యాలయ సమీపంలో బస్సులు డీజిల్ లేక ఆగిపోయాయని పేర్కొన్నారు. ఆర్టీసీ అధికారుల వికారాబాద్ కేంద్రంలోనే ఉన్న కానీ బస్సులలో డీజిల్ అయిపోవడం విడ్డూరకరమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. డీజిల్ అయిపోవటముతో బస్సు డ్రైవర్ వేరే బస్సులో వెళ్లండి అని చెప్పడం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు. ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ డిపో నుండి బయలుదేరేటప్పుడు సంబంధిత అధికారులు పర్యవేక్షణ లేకుండా ఈ విధంగా బయటికి బస్సులను పంపియడం చాలా బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులో కనీసం డీజిల్ కూడా చూసుకోకుండా బస్సులు నడిపిస్తున్నారంటే ఆర్టీసీ అధికారుల పనితీరు ఎలా ఉందో దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుందని ప్రయాణికులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ సిబ్బందిపై సంబంధిత అధికారులు పర్యవేక్షించి ఇలాంటి సంఘటనలు ఒప్పునారావృతం కాకుండా చూడాలని ప్రయాణికులు కోరారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం