Breaking News

ఆంధ్రప్రదేశ్లో మొదలైన పదవ తరగతి పరీక్షలు

ఫస్ట్ డే ప్రశాంతం ప్రతి విద్యార్థి
మొఖంలో చిరునవ్వు

నందిగామలో పదవ తరగతి విద్యార్థులు 1480 మంది ఉండగా 1467 మంది పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులు.

మన ప్రగతి న్యూస్ /ఆంధ్ర ప్రదేశ్ /నందిగామ

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

రాష్ట్రవ్యాప్తంగా మొదలైన పదవ తరగతి పరీక్షలు హాజరైన 6,49,884 మంది విద్యార్థులు విరికోసం 3,450 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసిన విద్యాశాఖ అధికారులు.
ఉ =9 :30 ని ల నుండి మధ్యాహ్నం12 : 45 ని ” ల వరకు పరీక్షా సమయాన్ని కేటాయించిన ఏపీ విద్యాశాఖ అధికారులు.నందిగామ పట్టణ ప్రాంతంలో పదవ తరగతి పరీక్షలు వ్రాసే విద్యార్థుల కోసం 10 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులు,
నందిగామ పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్న 1467 మంది విద్యార్థులు హాజరయ్యారు.
నందిగామ డివిజన్ మొత్తం 6035 మంది విద్యార్థులు ఉండగా 5097 మంది పరీక్షకు హాజరయ్యారు.ప్రతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేశారు.
విద్యార్థినీ, విద్యార్థులను తనిఖీ చేసి పరీక్ష హాల్లోకి అనుమతిస్తున్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు మధ్య విద్యార్థిని ,విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులు.