మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్
కేరళలోని పాలక్కాడు జిల్లా కు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ ప్రకటించింది. గురువారం ఆ జిల్లాలో అతినీలలోహిత కిరణాలు అధిక స్థాయిలో ఉన్నట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాలక్కాడు, మలపురం జిల్లాలోని త్రితల, పొన్నాని ప్రాంతాల్లో ఉన్న యువి మీటర్లలో ఇది 11 పాయిట్లుగా నమోదు అయింది. ప్రజలు అతి నీలలోహిత కిరణాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రజలకు సూచనలు చేసింది.