మన ప్రగతి
న్యూస్ /నర్సంపేట
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం లోని ఖానాపూర్ మండలం పాకాల చెరువు సమీపంలో నర్సంపేట నుండి కొత్తగూడ వెళ్తున్న ఆర్టీసీ బస్సును చిలుకమ్మ నగర్ నుండి నర్సంపేటకు వస్తున్న ఆటో ఢీకొనడంతో ఒక వ్యక్తి కాలుకు గాయాలు
ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ కండక్టర్ కిందికి దిగి చూడగా ఆటోలో అడవి పంది మాంసం, ఒక చనిపోయిన కొండ గొర్రె ను గుర్తించడంతో భయపడిన ఆటోలోని నలుగురు వ్యక్తులు కొండగొర్రె ను అక్కడే పడవేసి అటోతో సహా పరారు.. పారిపోయిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కానాపురం మండలం చిలకమ్మ నగర్ చెందిన వారుగా ఫారెస్ట్ అధికారులు అనుమానిస్తున్నారు.