మన ప్రగతి న్యూస్/మంచిర్యాల జిల్లా ప్రతినిధి:

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణపూర్ పట్టణ కేంద్రంలోని క్యాతనపల్లి రైల్వే గేట్ ఈనెల 19 నుంచి 29 తేదీ వరకు మూసివేస్తున్నట్లు సెంట్రల్ రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా క్యాతనపల్లి మున్సిపాలిటీ ఆఫీస్ పక్కనే ఉన్న సంబంధిత రైల్వే గేటు యొక్క రైల్వే ట్రాక్ లైన్ మరమ్మతు లను ఒక రైల్వే ట్రాక్ లైన్ మూడు నెలలకు ఒకసారి చేసే పనులలో భాగంగా.. సేఫ్టీ కోసం పనులు చేపడుతున్నట్లు తెలిపారు. దాదాపు పది రోజులు క్యాతనపల్లి రైల్వే గేటు మూసి ఉంటుందని సంబంధిత అధికారులు తెలియజేశారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు.
