Breaking News

బి.సి. యువతీ యువకులకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ..

మన ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాపర్

_ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజమనోహార్..

తెలంగాణ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్, హైదరాబాద్ ద్వారా నిరుద్యోగ బి.సి. యువతీ యువకులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హకీంపేట్ హైదరాబాద్ నుండి ఉచిత డ్రైవింగ్ కోర్సులో HMV (హెవీ మోటారు వాహనం) & LMV (తేలికపాటి మోటారు వాహనం) శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానించుచున్నది. ఈ డ్రైవింగ్ HMV & LMV శిక్షణ కాలం వ్యవధి 38 రోజులు (అనగా 304 hours). ఈ శిక్షణ పూర్తయిన తర్వాత, సంబంధిత రవాణా సంస్థ అర్హత కలిగిన అభ్యర్థులకు పర్మినెంట్ లైసెన్స్ ఉచితంగా అందిస్తుంది. అభ్యర్థులకు ఉచిత భోజనం మరియు వసతి సౌకర్యం హకీంపేట, హైదరాబాద్ లోని TA & ZSTC (TGRTC) ద్వారా అందించబడుతుంది.

అర్హత ప్రమాణాలు (LMV)

వయస్సు కాలపరిమితి 18 నుండి 45 సంవత్సరాల వరకు LMV కొరకు, 20 నుండి 45 సంవత్సరాల వరకు HMV కొరకు ఉంది.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

విద్యార్హత: 8వ తరగతి ఉత్తీర్ణత

ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం (గ్రామీణ ప్రాంతం: రూ.1.50 లక్షలు పట్టణ ప్రాంతం : రూ.2.00 లక్షలు – ఒక సంవత్సరం క్రితం సర్టిఫికేట్), 3 పాస్పోర్ట్ ఫోటోలు, LMV లెర్నింగ్ లైసెన్స్ (LLR) -LMV అభ్యర్థులకు మరియు HMV లెర్నింగ్ లైసెన్స్ (LLR) -HMV అభ్యర్థులకు పత్రాలు/సర్టిఫికెట్లు తప్పనిసరి ఉండాలి.

ఆసక్తి కలిగిన నిరుద్యోగ బీసీ యువతి యువకులు అభ్యర్థులు దరఖాస్తు / పత్రాలను వారి వారి సంబంధిత జిల్లా బి.సి. అభివృద్ధి కార్యాలయానికి (District B.C. Development Office Sircilla) పని వేళలో చివరి తేదీ 15-03-2025 నుండి 31-03-2025 సాయంత్రం 5.00 గం: వరకు పూర్తి సర్టిఫికెట్లు సమర్పించవలసిందిగా కోరడమైనది.