Breaking News

తారాస్థాయికి మట్టి మాఫియాఏజెన్సీలో లక్షలాది రూపాయల వ్యాపారంపర్మిషన్లు సైతం షురూ….?ఓ అధికారి కనుసన్నల్లోనే వ్యవహారం

మనప్రగతి న్యూస్/అశ్వారావుపేట ప్రతినిధి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో మట్టి మాఫియా పూర్వ వైభవం సంతరించుకుంటుంది.అసుపాక, వినాయకపురం  ప్రభుత్వ చెరువుల్లో ఏడతెరపి లేకుండా సుమారు వందల ట్రిపులకు పైగా వ్యాపారం  జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు,ఒకపక్క అధికారులకు సమాచారం అందించిన కొందరు అధికారులు అక్రమార్కులకు తెరచాటున

కొమ్ముకాయడంతో లక్షల రూపాయల మట్టి వ్యాపారం జరినట్లు పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి,వివరాల్లోకి వెళితే అశ్వారావుపేట మండలం, నారాయణపురం,వినాయకపురం,అసుపాక దిబ్బతోగూ గ్రామంలో  గత వారం రోజులుగా ఇరిగేషన్ శాఖకు చెందిన ప్రభుత్వ చెరువుల్లో,భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు రాత్రి పగలు తేడా లేకుండా ఇష్టా రీతిన  జరగడంతో ప్రయాణించే రోడ్ల పై మట్టి పెరుకుపోవడంతో ప్రయాణించే రోడ్లు ప్రమాదకరంగా మారుతున్నాయని రాత్రుళ్ళు ట్రాక్టర్ శబ్దాలతో పలు ఇబ్బందులకు గురవుతున్నట్లు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,ఎవరైనా ప్రశ్నిస్తే మట్టి మాఫియా ముఠాలు దాడులకు కూడా వెనకడడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు,ఈ విషయం పై  అధికారులకు ఎన్నిసార్లు సమాచారం అందించిన లాభం లేదని,మట్టి మాఫియా ముఠాలకు పర్మిషన్లు ఉన్నట్లు వారే బహిరంగంగా చెప్తున్నారని,మైనింగ్ పర్మిషన్ తవ్వకాలకు అనుమతి ఇచ్చే అధికారం రెవెన్యూ శాఖకు ఎలా ఉంటుందని పైగా 1/70 యక్ట్ లో ఇంత దౌర్జన్యం గా మట్టి మాఫియా తవ్వకాలు జరుపుతుంటే పోలీస్ శాఖ ఎందుకు మాట్లాడడం లేదని పలు సందేహాలు గ్రామస్థులు వెళ్లగక్కుతున్నారు

ముచ్చటగా నాలుగోసారినాగార్జున సాగర్ డ్యాం వద్ధ చెలరేగిన మంటలు

,జిల్లా ఉన్నతాధికారులు స్పందిస్తే తప్ప మళ్ళీ రెచ్చిపోతున్న మట్టి మాఫియాను అరికట్టడం జరగదని పలువురు తెలియజేసారు.
రెవెన్యూ కార్యాలయంలోనే ఈ మట్టి మాఫియాకు పునాది పడుతున్నట్లు కీలక సమాచారం,రెవెన్యూ శాఖలో ఓ ఉన్నతాదికారి కనుసన్నల్లోనే ఏజెన్సీ ప్రాంతాల్లో మట్టిమాఫియా విజృంభిస్తోందని రోజుల లెక్క వ్యవహార లావాదేవీలకు కారణమవుతోందని పలువాదనలు వినిపిస్తున్నాయి,ఈ విషయమై అనేక విషయ విషయాలు తెలియాల్సి ఉంది.