మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి

నాగార్జునసాగర్ హిల్ కాలనీ తెలంగాణ టూరిజం కు చెందిన ప్రాజెక్ట్ గెస్ట్ హౌస్ నందు కొందరు వ్యక్తులు సుమారు 70ఏళ్ల నాటి వృక్షాలను కొట్టివేశారు, అటవీ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా వృక్షాలను తొలగిస్తుంటే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరం, సదరు లీజుకు తీసుకున్న వ్యక్తులను అడగగా తాము గ్రీనరీ కోసం చెట్లను తొలగించామని చెప్పటం గమనార్హం,గత నెల ఫిబ్రవరిలో ఆఫీసర్స్ క్లబ్ లో చెట్లను తొలగించినప్పుడు కేసులు పెట్టిన నాయకులు ఇప్పుడు చెట్లు తొలగించింది తమ పార్టీకి సంబంధించిన వారే కావడంతో మిన్నకుండిపోయారు,కింద చేసే గ్రీనరీ కోసం ఏళ్ల నాటి వృక్షాలను తొలగించటమేంటని ప్రకృతి ప్రేమికులు వాపోతున్నారు ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి పెరిగిన చెట్లను తొలగించకుండా చర్యలు తీసుకోవాలని, చెట్లను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.