ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్
మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్
తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ & జూనియర్ కళాశాల (గర్ల్స్)లో ఇన్స్పైర్ & ఇగ్నైట్ యూత్ ట్రాన్స్ఫర్మేషన్ మిషన్ ఆధ్వర్యంలో సోమవారం ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.రంజిత్, సుధాకర్ అండ్ టీం విద్యార్థినులకు కమ్యూనికేషన్, స్పీకింగ్, రైటింగ్, బాడీ లాంగ్వేజ్ వంటి పలు స్కిల్స్‌పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలు సాధించాలని, సమాజానికి సేవ చేసే పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, కాంగ్రెస్ నాయకులు శీలం వెంకట నర్సిరెడ్డి, వడ్డే నారాయణరావు, బొర్రా రాజశేఖర్, కట్ల రంగారావు, సూతకాని జైపాల్, ఏన్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు స్వర్ణ నరేందర్, ఏన్కూరు మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ గూగులోతు లచ్చిరాం,ఏన్కూర్ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు వాసిరెడ్డి నాగేశ్వరరావు, బాదావత్ సేవ్య, గుగులోతు బగ్గు నాయక్, మొగిలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


