Breaking News

రక్తదానం చేయండి.ప్రాణాదాతలు కాండి.

28 వ సారి రక్తదానం
చేసిన రాజశేఖర్

అభినందించిన డి.సి.పి
అంకిత్ కుమార్

ఎ.సి.పి రవీందర్ రెడ్డి

పెండింగ్ బిల్లులు చెల్లించాలి..

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో
భాగంగా సోమవారం
నర్సంపేట డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో
నర్సంపేట పట్టణ సిటిజన్
ఫంక్షన్ హాల్ లో
రక్తదాన శిబిరం ఏర్పాటు
చేశారు. ముఖ్య అతిధి గా విచ్చేసిన డీసీపీ అంకిత్ కుమార్ 28 వ సారి రక్తదానం చేసిన ఏ.యస్.అర్ సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఎర్రబోయిన రాజశేఖర్ ను అభినందించారు.
అనంతరం డిసిసి అంకిత్ కుమార్ మాట్లాడుతూ,మనం చేసే రక్తదానం వల్ల ప్రాణాపాయ స్థితి లో ఉన్న మరొకరికి ప్రాణదానం చేసినవారం అవుతామని అన్నారు, ఎలాంటి అపోహలు లేకుండా రక్తదానం లో యువత ముందుండాలని పిలుపు నిచ్చారు.
18 సంవత్సరాలు నిండినవారు రక్తదానం చేయవచ్చన్నారు.
అలాగే 5 వ సారి రక్తదానం చేసిన మెడికల్ షాప్ జాయింట్ సెక్రటరీ రవికాంత్ ను డీసీపీ అభినందించారు.
కార్యక్రమం లో ఏసిపి రవీందర్ రెడ్డి ,టౌన్ సీఐ రఘుపతిరెడ్డి , యస్.ఐ
అరుణ్ కుమార్ ,
మండలలా యస్. ఐ లు
సి.ఐ లు పోలీసు లు మరియు రక్తదాతలు పాల్గొన్నారు.