Breaking News

సీసీ కెమెరాల ఆటోమేటిక్ క్లిక్‌.వాహనదారులకు బిగ్ అలర్ట్

_ జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, ఐపీఎస్.

మన ప్రగతి న్యూస్ / సిరిసిల్ల జిల్లా స్టాపర్

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధిలోని కోరుట్ల బస్టాండ్, సాయిరక్ష చౌరస్తా, ఒల్డ్ బిడ్జి, తిప్పపూర్ బస్టాండ్ కరీంనగర్ నుండి వచ్చే దారి, సిరిసిల్ల నుండి వచ్చే దారిలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు, ఈ కెమెరాల ద్వారా పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనాల,ర్యాష్ డ్రైవింగ్,త్రిబుల్ డ్రైవింగ్,మైనర్ డ్రైవింగ్,సెల్ ఫోన్ డ్రైవింగ్,నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాల నంబర్ ప్లేట్స్ ఆటోమేటిక్‌గా స్కాన్ చేసి సంబంధిత వాహనాల యజమానులకు ఈ-చాలాన్ జారీ చేయబడుతాయన్నారు.
ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను నియంత్రించడం,చోరీ వాహనాలను గుర్తించడం,అనుమానిత వాహనాలు గుర్తించడం,నేర పరిశోధనలో వేగం పెరగడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు, పట్టణ ప్రజలు,వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం,స్పీడ్ పరిమితులలో డ్రైవింగ్, మద్యం సేవించి డ్రైవ్ చేయరాదు వంటి నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
ఆటోమేటిక్ సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన వేములవాడ పట్టణానికి చెందిన IMA వారిని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, వేములవాడ పట్టణానికి చెందిన ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు పట్టణ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని జిల్లా ఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, రూరల్ సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ లు రామ్మోహన్,రూరల్ ఎస్.ఐ వెంకట్రాజం,ఎల్లగౌడ్, రాజు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.