Breaking News

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డి ఎం హెచ్ ఓ

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి

మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ సాంబశివ ఆకస్మిక తనిఖీ చేశారు. తొలిత రికార్డులను హాస్పిటల్ వాతావరణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్వో సాంబశివ మాట్లాడుతూ వైద్యాధికారి డాక్టర్ ఆచార్య సిబ్బందికి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దోమల ద్వారా విష జ్వరాలు తదితర రోగాలు బారిన ప్రజలు పడే అవకాశం ఉందని ఆసుపత్రి సిబ్బంది అందుబాటులో ఉండే ప్రజలకు సరైన వైద్యం అందించాలని తెలిపారు. మెంతా తుఫాన్ వర్షం కురుస్తున్న నేపథ్యంలో డాక్టర్లు ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండి ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మెడిసిన్ అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆచార్య, నిఖిల, హెచ్ఎ కృష్ణ, ఫార్మసిస్టు రంగారావు, ఆశా కార్యకర్తలు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి