Breaking News

జూరాల కొత్తపల్లి కృష్ణానదిపై బ్రిడ్జికి టెండర్ విడుదల

పదేళ్లు పాలించిన ఎమ్మెల్యేలు ఆత్మకూరు అభివృద్ధి వెనక్కి నెట్టేశారు

తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరికి ప్రత్యేక ధన్యవాదాలు

ఆత్మకూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎండి రహమతుల్లా

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:-

వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల గ్రామం మీదుగా కృష్ణా నదిపై కొత్తపల్లి వరకు నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం బుధవారం రోజు టెండర్ ప్రకటించడం జరిగిందని ఆత్మకూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎండి రహమతుల్లా తెలిపారు. కొన్ని రోజులుగా సందిగ్ధంగా ఉన్న ఈ బ్రిడ్జి నిర్మాణం కొందరు నందిమల్ల గ్రామ సమీపంలో నిర్మించాలని వినతి ఇవ్వడం జరిగింది చివరికి జూరాల దగ్గర బ్రిడ్జి నిర్మాణానికి టెండర్ ప్రకటించడం తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పదేళ్ల పాలించిన ఎమ్మెల్యేలు ఆత్మకూర్ పట్టణ అభివృద్ధిని వంద ఏళ్లకు వెనక్కినట్టేశారు. రెండు ఏళ్లు పూర్తికాని తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు కృషిచేసి వందేళ్లు వెనక్కి వెళ్లిన ఆత్మకూరు పట్టణ అభివృద్ధిని తరతరాలకు చెక్కుచెదరని అభివృద్ధి చెందుతున్న విధంగా ఆత్మకూరు పట్టణాన్ని నిరూపించేందుకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆత్మకూరు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తూ కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సంకల్పంతో 123 కోట్ల రూపాయల విడుదల చేయడం వర్షం వ్యక్తం చేశారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బ్రిడ్జి నిర్మాణం శంకుస్థాపన చేసినందుకు మంత్రి వాకిటి శ్రీహరి సిద్ధమవుతున్నారు తెలిపారు. ఆత్మకూరు పట్టణ ప్రజల చిరకాల వాంఛ అయిన మొదటి ప్రయత్నం జూరాల గ్రామం దగ్గర కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం పట్టణ ప్రజల గర్వించదగ్గ విషయమని మిర్చి నిర్మాణం అయితే ఆత్మకు పఠనం కోల్పోయిన పూర్వ వైభవం మళ్లీ వస్తుందని ఎక్కడికి వెళ్లాలన్న సరైన సౌకర్యం లేక ఎన్నో ఇబ్బందులు ఎన్నో అడ్డంకులు పడ్డ ఆత్మకూరు జనాలు త్వరలో వారి ఇబ్బందులు తీరబోతున్నాయని మార్కెట్ చైర్మన్ రహమతుల తెలిపారు.