Breaking News

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

సీజనల్ వ్యాధులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

బైక్ స్కిడ్ అయి యువకుడికి తీవ్ర గాయాలు

మోంథా తుఫాన్ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా, నర్సంపేట నియోజకవర్గ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీలైనంత వరకు అత్యవసరం అయితే తప్ప ఈ 48 గంటలు బయటికి రాకపోవడం మంచిది.
వృద్ధులు, వికలాంగులు, చిన్నారుల పట్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి.
విద్యుత్ స్తంభాలకు, అధికంగా నీరు చేరిన ప్రదేశాలకు, అనుమానస్పద గుంతలకు దూరంగా ఉండాలి.
గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ వైర్లు తెగే ప్రమాణం ఉంటుంది. కాబట్టి, గమనించి వెళ్ళాలి. అలాగే చిన్నారులను, యువకులను చెరువులు, కుంటల వద్దకు వెళ్లకుండా చూడాలి.చిన్న పిల్లలను బయటకు వెళ్లకుండా చూడాలి.రైతులు వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి.లోతట్టు ప్రాంతాలు, శిథిలావస్థ ఇళ్లలోని వారిని సురక్షిత ప్రాంతాలకుగానీ, పునరా వాస కేంద్రాలకుగానీ అధికారులు తరలించి వారికి భోజన సదుపాయం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి.
ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ళ నుండి బయటకు రావొద్దని తెలిపారు.