Breaking News

మొంథా తుఫాన్ కారణంగా జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

తుఫాన్ తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

బిఆర్ఎస్ జిల్లా నాయకులు డా.ర్యాకల శ్రీనివాస్

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి:

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

భువనగిరి:-మోంథా తుఫాను కారణంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సామాజికవేత్త బిఆర్ఎస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరెంట్ స్తంభాలను,విద్యుత్ వైర్లను,ట్రాన్స్ ఫార్మర్లను తాకకుండా ఉండాలని, మ్యాన్ హోల్స్,డ్రైనేజీలను చూసుకుని నడవలని,ఉధృతంగా ప్రవహించే చెరువులు,వాగుల వద్దకు వెళ్లకుండా ఉండాలని,వ్యవసాయ,తదితర పరిసర ప్రాంతాల్లో విష సర్పాలతో జాగ్రత్త ఉండాలని,పాత గోడలు,పాత ఇండ్లు కూలిపోయే స్థితిలో ఉంటే ముందస్తు జాగ్రత్తగా తీసుకోవాలని,అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని అన్నారు.సహాయక చర్యలు చేపట్టేందుకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని కోరారు.అలాగే అకాల వర్షం తోటి వరి,పత్తి అధికంగా నష్టం అవుతుంది.కావున ప్రభుత్వం రైతులను తక్షణమే ఆదుకోవాలని,ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞాపన చేస్తున్నామని తెలిపారు.