- సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గ పీసీసీ సభ్యులు)
- మన ప్రగతి న్యూస్/ నెక్కొండ
వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున, ఎవరూ వాటిని దాటే ప్రయత్నం చేయవద్దు. అలాగే, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని నర్సంపేట నియోజకవర్గ పిసీసీ సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారు ఎవరైనా ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేసి, నిరంతరం పర్యవేక్షణ జరిపేలా ఆదేశాలు జారీ చేశారు.నర్సంపేట నియోజకవర్గం లో వాగులు అధికంగా ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అధికారులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రజలకు అవగాహన కల్పించి, వారు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

