ప్రెస్ క్లబ్ యూనియన్ అధ్యక్షుడు మెట్ట గడపల సాంబయ్య
మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి
మండలంలోని ప్రెస్ క్లబ్ యూనియన్ అధ్యక్షుడు మెట్ట గడపల సాంబయ్య మాట్లాడుతూ తుఫాన్ వర్షం కారణంగా ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. వృత్తిపరంగా వార్త సేకరణలో భాగంగా బైక్లపై కార్లపై ప్రయాణం చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనుకోకుండా ఏదైనా జరిగితే కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని అన్నారు .జర్నలిస్టులు తుఫాన్ తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ప్రభుత్వానికి అన్ని విధాల సహకరించి వార్తలు అందించే విధంగా ఉండాలని కోరారు. వీధి నిర్వహణలో ఏమైనా ఇబ్బందులు జరిగితే ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

