రోడ్డు ప్రమాదాల పైన ప్రత్యేక దృష్టి సారించి నివారణ చర్యలు తీసుకోవాలి
గ్రామ పోలీసు అధికారులు ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా పని చేయాలి
శాంతి భద్రతల పరిరక్షణకు అధికారులు,సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలు అందుబాటులో ఉంటూ పని చేయాలి
దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్ ఆకస్మిత తనిఖీ
ఎస్పీ శరత్చంద్ర పవర్ ఐపీఎస్
మన ప్రగతి న్యూస్ నల్గొండ/కొండమల్లేపల్లి
కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు,పోలీసు స్టేషన్ పరిధిలోని పరిసరాలు,స్థితిగతులు గురించి యస్.ఐ ను అడిగి తెలుసుకుని రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్,స్టేషన్ రైటర్, లాక్ అప్, యస్.హెచ్.ఓ రూమ్ తదితర ప్రదేశాలు, సిబ్బందికి కేటాయించిన కిట్లను పరిశీలించడం జరిగింది. ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని,ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు నేర నియంత్రణకు కృషి చేయాలని, బ్లూ కోల్ట్ , పెట్రో కార్ డ్యూటీ లో ఉన్నప్పుడు 100 డయల్ కాల్స్ కి తక్షణమే స్పందిస్తూ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. పెట్రోలింగ్ సమయంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను ప్రతి రోజు తనిఖీ చేయాలని,స్టేషన్ పరిధిలో సీసీటీవీల ఏర్పాటుపై దృష్టి సారించి సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు.సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు,ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది పని చేయాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు అయిన గంజాయి,అక్రమ ఇసుక రవాణా, పిడియస్ రైస్ అక్రమ రవాణా,జూదం లాంటి వాటిపై ఉక్కుపాదం మోపాలని , అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచాలని ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు,ఓవర్ స్పీడ్,ట్రిపుల్ డ్రైవింగ్,మైనర్లు వాహనాలు నడుపుట లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక ఐపీఎస్, సీఐ నవీన్ కుమార్ ఎస్.ఐ రమేష్ మరియు స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

