Breaking News

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..

ములకలపల్లి మండల పరిధిలోని పాత గంగారం గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు సోమవారం తెల్లవారు జామున ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు గత కొంత కాలంగా మండలంలోని పరిసర గ్రామాలలో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నట్లు స్థానికులు తెలి పారు. సమాచారం తెలుసుకున్న ములకలపల్లి ఎస్ఐ. మధు ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకొని, మృతి చెందిన వ్యక్తి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు.ఈ వ్యక్తి కి సంబంధించిన బంధువులు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే, ములకలపల్లి పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని తెలిపారు.

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..