బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

ఢిల్లీలో బాంబు పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించిన న్యాయవాదులు

అందెశ్రీ అకాల మరణానికి బార్ అసోసియేషన్ సంతాపం

మన ప్రగతి న్యూస్/ దమ్మపేట:

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు నందు పనిచేస్తున్న న్యాయవాదులు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు హాలు నందు మంగళవారం సమావేశమై ఇటీవల ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే సోమవారం తెలంగాణ గీత రచయిత, మహాకవి అందెశ్రీ మరణించటం చాలా బాధాకరమైన విషయం అని బాధాతప్త హృదయాలతో మర్యాద పూర్వకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో మాయమైపోతున్నడమ్మా మానవత్వమున్న మనిషి అనే గేయాన్ని రచించి, సామాన్యుల గుండెల్లో స్థిరపడిపోయిన అందెశ్రీ భౌతికంగా మరణించినా ఆయన రచించిన కవితల్లో, రచనల్లో చిరకాలం జీవించే ఉంటారని అన్నారు. ఢిల్లీ పేలుడు ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి దుస్సంఘటనలు జరగకుండా చేయాలని, భారతదేశంలోనే ప్రజలందరు ప్రశాంతంగా జీవించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మారం సతీష్ కుమార్ బాబు, గొంది మురళి మోహన్, లక్కినేని నరేంద్రబాబు, ముప్పిడి శ్యామ్ సుధాకర్, నల్లపు ఉదయ్, దర్గావళి బాలరాజు, అరుణ కుమారి, భవాని కృష్ణ యాదవ్ తదితర లాయర్లు పాల్గొన్నారు.