బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

ఎల్లారెడ్డిలో పోలీసుల కఠిన చర్యలు డ్రంక్‌ డ్రైవ్‌ బంద్‌

ఎస్సై బొజ్జ మహేష్ హెచ్చరిక

మన ప్రగతి న్యూస్ /ఎల్లారెడ్డి:

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

ఎల్లారెడ్డి పట్టణంలో ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించే వాహనదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే డ్రైవర్లపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై బొజ్జ మహేష్ స్పష్టం చేశారు. బుధవారం అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఎస్సై ఆధ్వర్యంలో భారీ స్థాయిలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సై బొజ్జ మహేష్‌ మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయడం అంటే ప్రాణాలతో చెలగాటమే. ఒక ప్రాణం అంటే ఒక కుటుంబం విలువ, అని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్‌సి, ఇన్సూరెన్స్‌ వంటి అవసరమైన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని, పెండింగ్‌లో ఉన్న చలాన్లు వెంటనే చెల్లించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్‌ నియమాలను కచ్చితంగా పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయని, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఈ ఈ తనిఖీల్లో ఆయనతోపాటు ఎల్లారెడ్డి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.