Breaking News

పేదోడి సొంతింటి కల నెరవేర్చడం ప్రజా ప్రభుత్వానికి సాధ్యం 

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు 

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

మనప్రగతిన్యూస్/ పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి :

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదోడి సొంతింటి కల నెరవేర్చడం రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికే సాధ్యమని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. గురువారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 29 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ పేదలు మరువలేని పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. గతంలో వైయస్సార్ పేదల సంక్షేమం కోసం 108 సేవలకు శ్రీకారం చుట్టాడని, సీఎం రేవంత్ రెడ్డి ఉగాది కానుకగా సన్న బియ్యం పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టాడని తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇంటిని నిర్మించి ఇవ్వాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్మన్నారు. పాలకుర్తి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తామని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి యువ వికాసం పథకాన్ని ప్రారంభించాడని తెలిపారు. చేసింది చెప్పడం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ నైజం అన్నారు. హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు.రైతు రుణమాఫీ అందించామని తెలిపారు. గ్రామంలో గల అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావుడియా మంజుల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు జలగం కుమార్, చిలువేరు కృష్ణమూర్తి, తాజా మాజీ సర్పంచులు పోగు శ్రీనివాస్, నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గోనె మహేందర్ రెడ్డి, నాయకులు మొలుగూరి యాకయ్య గౌడ్, బైకానీ ఐలేష్, గాదపాక భాస్కర్, బండి పల్లి మణెమ్మ, గోనె దామోదర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.