బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ
మన ప్రగతి న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాపర్:
శ్రీ సత్య సాయి సమాజ సేవా ట్రస్ట్, రైటర్ బస్తీ కొత్తగూడెం లో జిల్లా న్యాయ సేవాదికార సంస్థ, కొత్తగూడెం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమం లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ ముఖ్య అతిధిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతు తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం, 2007 యొక్క ప్రయోజనాలు మరియు అమలు గురించి ప్రజలకు అవగాహన కల్పించవల్సిన అవసరం ఉందని తెలిపారు.
వృద్ధుల సంరక్షణ, పోషణ మరియు వారి ఆస్తుల రక్షణ కోసం ఈ చట్టం కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని అన్నారు. వృద్ధులను వారి కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేసినా, వేధించినా, ఈ చట్టం వారికి రక్షణ కల్పిస్తుందని చెప్పారు. తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్‌లను పోషించడంలో వారి పిల్లలు లేదా బంధువులు విఫలమైతే, వారు పోషణ భత్యం (మైంటెనెన్సు) కోసం ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చని అన్నారు. వృద్ధులు తమ ఆస్తిని పిల్లలకు లేదా బంధువులకు బదిలీ చేసిన తర్వాత, వారు తమను సరిగా చూసుకోకపోతే, ఆ బదిలీని రద్దు చేసుకునే అవకాశం ఈ చట్టం కల్పిస్తుందని అన్నారు. వృద్ధుల సంరక్షణ కోసం ప్రతి జిల్లాలో వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయడానికి మరియు వాటిలో కనీస ప్రమాణాలను పాటించడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుందని తెలిపారు. వయోవృద్ధులకు ఉచిత న్యాయ సహాయం అందించబడుతుందని అన్నారు.”వృద్ధులు తమ హక్కుల గురించి తెలుసుకోవాలని మరియు తమకు అన్యాయం జరిగినప్పుడు లేదా నిర్లక్ష్యానికి గురైనప్పుడు ఈ చట్టాన్ని ధైర్యంగా ఉపయోగించుకోవాలని తెలిపారు. వయోవృద్ధులు లేదా వారి తరపున ఇతరులు ఈ చట్టం కింద ఫిర్యాదు చేయడానికి మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ (మైంటెనెన్సు ట్రిబ్యునల్) ను సంప్రదించవచ్చని. అన్నారు. సాధారణంగా, ఇది రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డిఓ లేదా సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం స్పెషల్ జ్యూడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు, వైస్ ప్రెసిడెంట్ గోపికృష్ణ, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి. నిరంజన్ రావు, అడ్వకేట్ మారపాక రమేష్, సత్యసాయి ఆర్గనైజర్ సుబ్బారావు సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు.

