-భక్తులతో సందడిగా మారిన ఆలయం
-శివ నామస్మరణతో మారు మోగిన పరిసర ప్రాంతాలు
మనప్రగతిన్యూస్/పాలకుర్తి:
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ( హరి హర క్షేత్రం) సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల నుండే భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయాన్ని చేరుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర అంటూ వారు చేసిన శివ నామస్వరనతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. భక్తులు స్వామివారాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ముక్కలు చెల్లించుకున్నారు. మహిళలు ఆలయంలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ
స్వామి కొండపై ఏర్పాటుచేసే అఖండ జ్యోతి నీ భక్తులు దర్శించుకుని వారి మొక్కలు చెల్లించుకుంటారని అన్నారు. రాష్ట్ర ప్రజలు పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే ఆలయంలో ఏర్పాటు చేసిన కార్తీక దీపోత్సవం ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని ఆలయ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ ,మండల పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు జలగం కుమార్, బండిపల్లి మణెమ్మ, పాలకుర్తి , గూడూరు గ్రామాల మాజీ సర్పంచ్లు వీరమనేని యాకాంతారావు,మాచర్ల పుల్లయ్య, సోమేశ్వర ఆలయ మాజీ చైర్మన్ చిలువేరు కృష్ణమూర్తి , పాలకుర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కమ్మగారి నాగన్న గౌడ్,పాలకుర్తి మాజీ ఉపసర్పంచ్ మారం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మొలుగూరి యాకయ్య గౌడ్,పెనుగొండ రమేష్, నారగోని ఎల్లయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు
జనగామ జిల్లా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కార్తీక శోభ
-భక్తులతో సందడిగా మారిన ఆలయం
-శివ నామస్మరణతో మారు మోగిన పరిసర ప్రాంతాలు
మనప్రగతిన్యూస్/పాలకుర్తి:
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ( హరి హర క్షేత్రం) సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల నుండే భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయాన్ని చేరుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర అంటూ వారు చేసిన శివ నామస్వరనతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. భక్తులు స్వామివారాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ముక్కలు చెల్లించుకున్నారు. మహిళలు ఆలయంలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ
స్వామి కొండపై ఏర్పాటుచేసే అఖండ జ్యోతి నీ భక్తులు దర్శించుకుని వారి మొక్కలు చెల్లించుకుంటారని అన్నారు. రాష్ట్ర ప్రజలు పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఆలయంలో ఏర్పాటు చేసిన కార్తీక దీపోత్సవం ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని ఆలయ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ ,మండల పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు జలగం కుమార్, బండిపల్లి మణెమ్మ, పాలకుర్తి , గూడూరు గ్రామాల మాజీ సర్పంచ్లు వీరమనేని యాకాంతారావు,మాచర్ల పుల్లయ్య, సోమేశ్వర ఆలయ మాజీ చైర్మన్ చిలువేరు కృష్ణమూర్తి , పాలకుర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కమ్మగారి నాగన్న గౌడ్,పాలకుర్తి మాజీ ఉపసర్పంచ్ మారం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మొలుగూరి యాకయ్య గౌడ్,పెనుగొండ రమేష్, నారగోని ఎల్లయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు