Breaking News

జనగామ జిల్లా పాలకుర్తి క్షిరగిరి పై దర్శనమిచ్చిన అఖండ జ్యోతి

హరిహరుల క్షేత్రంగా సోమేశ్వరాలయం 

తెలంగాణలోనే మొదటి అఖండ జ్యోతి 

అఖండ జ్యోతిని వెలిగించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 

మనప్రగతిన్యూస్/పాలకుర్తి:

దక్షిణ భారతదేశంలో హరిహరుల పుణ్యక్షేత్రంగా పాలకుర్తికి గొప్ప చరిత్ర ఉందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గల శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గిరి ప్రదక్షణతో పాటు లక్ష దీపోత్సవ కార్యక్రమంలో మహిళలతో పాల్గొని దీపాలను వెలిగించారు. అనంతరం ఘాట్ రోడ్డు మీదుగా మెట్ల మార్గం లో ఆలయ కొండపైకి వెళ్లి అఖండ జ్యోతిని ఉత్తరకాశి పీఠాధిపతి శ్రీ శ్రీశ్రీ స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి తో కలిసి వెలిగించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా  తెలంగాణలో హరిహరుల పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయ కొండపై అఖండ జ్యోతి వెలిగించడం రాష్ట్రంలోనే మొదటి ఆలయం అని అన్నారు. దేశంలో అఖండ జ్యోతులను దక్షిణ భారతదేశంలో మూడు ప్రదేశాల్లో అఖండ జ్యోతిని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు. దక్షిణ భారత దేశంలో మొదటి ఆలయంగా కేరళ రాష్ట్రంలోని శబరిమలై ఆలయంలో మకర సంక్రాంతి సందర్భంగా,
రెండవ ఆలయంగా తమిళనాడులోని‌ అరుణాచలేశ్వరాలయ కొండపై, మూడవ ఆలయంగా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొండపై కార్తీక పౌర్ణమి సందర్భంగా అఖండ జ్యోతిని వెలిగిస్తారని తెలిపారు. 

అందరం కలసి బాధ్యతగా ఉంటేనే ప్రతీ సమస్య పరిష్కారం

గత తొమ్మిది సంవత్సరాలుగా హరిహరుల దివ్యక్షేత్రంలో అఖండ జ్యోతిని వెలిగించడంతో పాటు లక్ష దీపోత్సవం నిర్వహించడం దక్షిణ భారతంలోని తెలంగాణకే స్ఫూర్తిదాయకం అన్నారు.
పర్యాటక కేంద్రంగా పాలకుర్తి, వల్మిడి, బొమ్మెర గ్రామాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, మరింత అభివృద్ధి చేస్తామన్నారు. టూరిజం ప్యాకేజీలో పర్యాటక కేంద్రాలుగా సందర్శకులకు ఆహ్లాదకరమైన  వాతావరణాన్ని అందించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు.

-పర్యాటక కేంద్రాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది

పాలకుర్తి రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి చేసి పర్యాటక కేంద్రంగా పర్యాటకుల కోసం మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దుతామన్నారు. ఆలయాల అభివృద్ధి ఉట్టిపడేలా కృషి చేస్తామన్నారు. పాలకుర్తి సోమేశ్వర ఆలయం కొండపై అఖండ జ్యోతి చుట్టూ 25 గ్రామాలకు దర్శనం ఇవ్వడం అభినందనీయ
మన్నారు. పండుగల సందర్భంగా ఆలయాలను దర్శించుకోవడంలో భక్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆలయాల్లో సకల సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. అఖండ జ్యోతి సందర్భంగా సందర్శకులు, కోలాట బృందాలు, వాహన సేవకులు ఘనంగా స్వాగతం పలికారు.

అఖండ జ్యోతి కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలి రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాలకుర్తి సీఐ గట్ల మహేందర్ రెడ్డి, ఎస్సై లు దూలం పవన్ కుమార్, ఎం లింగారెడ్డి, సృజన కుమార్, రాజు లు పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు, సూపరిండెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, దేవస్థాన మాజీ చైర్మన్ చిలువేరు కృష్ణమూర్తి, మాజీ సర్పంచులు వీరమనేని యాకాంతరావు, మాచర్ల పుల్లయ్య, మాజీ ఉప సర్పంచు మారం శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ధారావత్ రాజేష్ నాయక్, పాలకుర్తి పట్టణ అధ్యక్షుడు కమ్మగాని నాగన్న గౌడ్, నాయకులు మొలుగూరి యాకయ్య గౌడ్,పెనుగొండ రమేష్, అనుబంధ సంఘాల అధ్యక్షులు బండిపెళ్లి మణెమ్మ, లావుడియా భాస్కర్ నాయక్, లావుడియా మంజుల నాయక్, గోనె మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ కారుబోతుల శ్రీనివాస్ గౌడ్, కామారపు సునీల్, గుగులోతు కిషన్ నాయక్, ఏలూరి యాకన్న తదితరులు పాల్గొన్నారు.