ప్రమాదాల నివారణ కోసం తొలగింపు
సంగెం ఎస్సై నరేష్
మన ప్రగతి న్యూస్/ సంగెం
సంగెం మండలంలో గవిచర్ల గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా చెట్లు చిన్నచిన్న గడ్డి కొమ్మలు పిచ్చి మొక్కలు పెరగడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని గమనించిన సంగెం ఎస్సై నరేష్ వాటిని తొలగించారు. మండలంలోని కాట్రపల్లి క్రాస్ నుంచి తీగరాజపల్లి వరకు మూల మలుపుల మీద రోడ్డుకు ఇరువైపులా వచ్చిన చెట్లను గడ్డిని తొలగించారు. గవిచర్ల గ్రామంలోని ప్రజలు ఎస్సై కి మరియు పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. రైతులు ఇలాంటి ఎస్సై మండలంలో ఉండటం వల్ల రైతులకు చాలా మేలు జరుగుతుందని రైతులు ఆనందపడ్డారు. ఎస్ఐ తో పాటు పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.