కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి అంటే హిందువులకి ఎంతో పవిత్రమైన రోజు. కానీ ఈ పరమ పవిత్రమైన రోజు వెనుకున్న నేపథ్యం , ప్రత్యేకతలు ఏంటి ?
మన ప్రగతి న్యూస్/ పరకాల
పరకాల పట్టణంలోని శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవాలయం మాజీ చైర్మన్ గందే వెంకటేశ్వర్లు దంపతులు కార్తీక పౌర్ణమి పూజలో పాల్గొని కుంకుమేశ్వర స్వామికి ప్రత్యేకమైన పూజలు చేసిన అనంతరం మాట్లాడుతూ కార్తీక మాసానికి సంబంధించి కార్తీక పౌర్ణమిని వివరించారు. కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి అంటే హిందువులకి ఎంతో పవిత్రమైన రోజు. శివుడు , శ్రీమహా విష్ణువులని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి , వారి అనుగ్రహం పొందేందుకు ఈ కార్తీక మాసం కన్నా పవిత్రమైనది మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ కార్తీక మాసంలో కానీ ప్రత్యేకంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున కానీ శివాలయాలు , విష్ణువు నెలవైన పుణ్యక్షేత్రాల్లో భగవంతుడిని దర్శించుకోవాలనుకునే భక్తుల తాకిడి అధికంగా వుంటుంది. ఇదే కార్తీక మాసాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తుంటారు. వారాణాసి లాంటి ఉత్తర భారతం ప్రాంతాల్లో ఇదే రోజుని దేవ దీపావళి , దేవ దివాళి అని అంటుంటారు. ముఖ్యంగా ఈరోజున వారణాసిలోని గంగా నది ఒడ్డున వున్న ఘాట్లు అన్నీ దీపాల అలంకరణతో శోభాయమానంగా వెలిగే దృశ్యం చూపరులని కట్టిపడేస్తుంది. అలాగే దక్షిణ భారత దేశంలో కొన్ని చోట్ల త్రిపుర పూర్ణిమ , త్రిపురారి పూర్ణిమ అని పిలుస్తుంటారు. శివుడు త్రిపురాసురుడిని అంతమొందించింది ఈరోజే కావడంతో… ఈ కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణిమ , త్రిపురారి పౌర్ణమి అని కూడా పిలుచుకుంటుంటారు.
కార్తీక పౌర్ణమి రోజునే విష్ణువుని కూడా పూజించడానికి ఓ కారణం వుంది. మహాప్రళయం బారి నుంచి మనుని రక్షించడానికి ఆ శ్రీ మహా విష్ణువు మత్సావతారం ఎత్తింది ఈ కార్తిక పౌర్ణమి రోజునే. అందుకే ఇవాళ విష్ణువుని కూడా ఆరాధిస్తుంటారు. ఈ కార్తీక పౌర్ణమికి ప్రభోదిని ఏకాదశికి కూడా ఓ సంబంధం వుంది. ప్రభోదిని ఏకాదశితో ఆరంభం అయ్యే చతుర్మాసం పండగలన్నీ మళ్లీ నాలుగు నెలల తర్వాత ఈ కార్తీక పౌర్ణమితో ముగుస్తాయి.
ఈ పౌర్ణమికి త్రిపుర పూర్ణిమ అని మరొకపేరు.
కార్తీక పౌర్ణమి , కార్తీక పూర్ణిమ ఎలా వచ్చింది ?
మహాభారతం ప్రకారం తారకసురుడిని శివుడి తనయుడు కార్తీకేయ అంతమొందిస్తాడు. అయితే , ఈ ఘటన తర్వాత తారకసురుడి ముగ్గురు కుమారులు బ్రహ్మ దేవుడిని పూజించి , మెప్పించి , ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారు. ఎవరివల్లా మరణం లేకుండా వరంకోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథంకాని రథంమీద , విల్లుకాని విల్లుతో , నారికాని నారి సారించి , బాణంకాని బాణం సంధించి , మూడు నగరాలూ ఒకే సరళరేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురినీ ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వర బలంతో పట్టణాలతో సహా సంచారంచేస్తూ లోకాలన్నింటా కల్లోలం సృష్టిస్తున్నారు. వివిధ లోకవాసులు బ్రహ్మకు మొర పెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు. విష్ణువు దగ్గర కెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకా శక్తిలేదని , వారిని వెంటపెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్లాడు. దేవతలందరూ సహకరిస్తే తానీ పని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లుకాని విల్లుగా , ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా , శ్రీమహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను (మూడు పట్టణాల యజమానులైన రాక్షసులను) సంహరించాడని , అందువల్ల ఈ పేరు వచ్చిందనీ పురాణ కథనం.
కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి ఆ పరమ శివుడిని పూజించి రోజంతా ఉపవాసం ఉండటం భక్తులకి ఆనవాయితీ. కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం చేస్తే , శరీరానికి ఎన్నో శక్తులు చేకూరుతాయని… అందులోనూ పవిత్రమైన నదుల్లో ఈ నదీ స్నానం మరింత పవిత్రతని , పుణ్యంని చేకూరుస్తుందనేది భక్తుల బలమైన విశ్వాసం. అందువల్లే కార్తీక పౌర్ణమి రోజున ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వారణాసి భక్తుల రాకతో కిటకిటలాడుతుంటుంది.
దీపారాధన :
ఇంట్లో తులసి మొక్కకు కానీ లేదా దేవాలయాల్లో కానీ ఇవాళ దీపారాధన చేస్తే మరింత పుణ్యం , పూజా ఫలం దక్కుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. కొంతమంది కార్తిక పౌర్ణమి రోజున 360 జతల దీపాలు వెలిగిస్తుంటారు. దీనికి అర్థం.. సంవత్సరంలో ఒక్కో రోజుకి ఒక్కో దీపం చొప్పున అన్ని దీపాలు ఈ పరమ పవిత్రమైన రోజే వెలిగించి మీ అనుగ్రహం కోరుకుంటున్నాను దేవా అని.
సత్యనారాయణ వ్రతం :
సత్యనారాయణ వ్రతం జరుపుకోవడానికి కార్తీక పౌర్ణమి కన్నా అతి పవిత్రమైన రోజు మరొకటి లేదు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకు కారణం ఆ శ్రీ మహా విష్ణువుకి ఈ కార్తీక పౌర్ణమి అతి ప్రీతి పాత్రమైనది కావడమే. అందుకే మిగతా రోజుల్లో సత్యనారాయణ వ్రతం చేయడం కన్నా కార్తీక పౌర్ణమి రోజున చేసే వ్రతానికే పూజా ఫలం అధికం అని అంటుంటారు పెద్దలు.
ఏకాదశి రుద్ర అభిషేకం :
ఈరోజు శివనామస్మరణతో మోగిపోయే ఆలయాలన్నింటిలో సర్వ సాధారణంగా కనిపించేది ఏకాదశి రుద్ర అభిషేకం. పదకొండుసార్లు రుద్ర చమకం లేదా శివ నామస్మరణతో శివుడిని అభిషేకించడమే ఈ ఏకాదశి రుద్ర అభిషేకం ప్రత్యేకత అని తెలిపారు.
‘కార్తీక పౌర్ణిమ’ నేపథ్యం , ప్రత్యేకతలు ఏంటి ?