Breaking News

నర్సంపేట పట్టణంలో కార్తీక శోభను సంతరించుకున్న ఆలయాలు

మన ప్రగతి న్యూస్ /నర్సంపేట

కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమినీ పురస్కరించుకొని నర్సంపేట పట్టణంలోని దేవాలయాలన్నీ కొత్త శోభను సంతరించుకున్నాయి. ఉదయం నుండే మహిళలు తలాంటు స్నానాలు చేసి దైవభక్తితో దేవాలయాలను సందర్శించుకొని ,ప్రత్యేకమైన పూజలను చేశారు. కార్తీక పౌర్ణమి వచ్చిందంటే మహిళలకు ఎంతో ప్రీతిపాత్రమైన పండగ. తమ ఇంటిల్లిపాది కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో ఉండాలని, మహిళలు సౌభాగ్యురాలై తమ భర్త, పిల్లలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే పండగ. దీనికోసం ఉదయం నుండే మహిళలు పూజలో పాల్గొంటారు. సాయంత్రం వేళ దేవాలయాన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా దేవాలయాలలో దీపాలు వెలిగించి వత్తులు కాల్చి దైవ దర్శనం చేసుకుని తమ కుటుంబాన్ని చల్లగా చూడమని ఆ దేవదేవుడైన పరమేశ్వరుని కోరుకున్నారు. దీపాలతో ఇంటిల్లిపాదిని అలంకరించి మా జీవితాలు కూడా దీపాల వలె వెలిగి పోవాలని కోరుకుంటారు. మహిళలకు ఇష్టమైన ఈ పండుగను ఎంతో సంతోషంగా పట్టణమంతా జరుపుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం