Breaking News

కంఠ మహేశ్వర స్వామి పోతురాజు పునః ప్రతిష్ట హోమం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి:

బబ్బురి శ్రీకాంత్ గౌడ్

మన ప్రగతి న్యూస్/ దేవరుప్పుల:

అందరం కలసి బాధ్యతగా ఉంటేనే ప్రతీ సమస్య పరిష్కారం

దేవరుప్పుల మండలం,పెద్దమడూరు గ్రామంలో ఈనెల 17న శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం నందు బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ ఆర్థిక సహాయంతో గౌడ గ్రామ పెద్ద గుంటి చిన్న గౌడ్ పెద్దమనుషుల సహకారంతో పురోహితులు శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో జరిగే పోతురాజుల పునః ప్రతిష్టాపన,మహా యజ్ఞ కార్యక్రమాన్ని గౌడ సామాజిక వర్గం గ్రామ ప్రజలు ప్రముఖులు బంధుమిత్రులు అధిక సంఖ్యలో హాజరై ఆ స్వామి వారి దివ్య ఆశీస్సులు పొందాలని శుక్రవారం శ్రీకాంత్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమ అనంతరం శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని,కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించగలరని కోరారు.