మన ప్రగతి న్యూస్/హత్నూర:
మాలల ఆత్మీయ సమ్మేళనానికి హత్నూర మండలం నుండి కొన్యాల, హత్నూర, బోర్పట్ల, గుండ్ల మాచనూర్, ముచ్చర్ల, తదితర గ్రామాల నుండి దౌల్తాబాద్ లో అంబేద్కర్ తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి భారీగా బయలుదేరారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు, మాల మహానాడు మండల అధ్యక్షులు రాజీవ్ గాంధీ, లు మాట్లాడుతూ పి ఎస్ ఆర్ గార్డెన్ సంగారెడ్డి లో నిర్వహించ తలపెట్టిన మాలల ఆత్మీయ సమ్మేళనంలో భవిష్యత్ కార్యాచరణ మాలలకు జరుగుతున్న అన్యాయాలపై గళం విప్పడానికి మేధావులతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ నియంత పాలన అంతం చేయాలంటే ఐక్యమత్యంగా మాలల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయడానికె బయలుదేరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభు, పాలంచ సుధాకర్, నర్సింలు, అమృత్ రావు, మహిపాల్, లక్ష్మీనారాయణ, వీరస్వామి, మాణిక్యం, నర్సింలు, ఆయా గ్రామాల అంబేద్కర్ వాదులు యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.