
-కన్ను పడితే ఖబ్జా
సర్వే నెంబర్ – 115లో ఆనవాళ్లు కోల్పోయిన వైకుంఠధామం
జిల్లా కలెక్టర్ కు పిర్యాదు పట్టించుకోని సంబంధిత అధికారులు
ప్రభుత్వ భూమి కాపాడాలని స్థానిక ప్రజల డిమాండ్
మన ప్రగతి న్యూస్ /
రఘునాథపల్లి :
కాదేది ఖాబ్జాకు అనర్హం అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి.. చెరువులు,కాలువలు కుంటలు,అడవులు చివరికి స్మశానాలను కూడా వదిలి పెట్టడం లేదు.రఘునాథపల్లి మండల కేంద్రంలో కంచనపల్లి రోడ్డు నర్సరీ పక్కన ఉన్న SC స్మశానవాటికను ఖబ్జా చేసి కొన్ని సమాధులను తొలగించి వ్యవసాయం చేస్తున్నారు..ఎవరు
పట్టించుకుపోవడం వల్ల ఇది కొన్ని సంవత్సరాలనుండి ఇలాగే జరుగుతుంది..
వివరాలలోకి వెళితే సర్వే నెంబర్ -115 లో ఎస్సీ స్మశానవాటిక మొత్తం 3.24 ఎకరాలు.. ఇందులో 1.24 ఎకరాలు గ్రామస్తుడు అయిన యాద రాములు అన్యాక్రాంతం చేసాడని స్థానిక ప్రజలు జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేయడం జరిగింది .. తప్పుడు పత్రాలతో పట్టా చేసుకొని ఖబ్జా చేసిన వ్యక్తికి స్థానిక పెద్దమనుషులు, రాజకీయ నాయకులు మరియు అధికారుల సహకారం ఉన్నందువల్లనే స్మశానవాటిక ఖబ్జా అయినట్టు స్థానికులు పిర్యాదులో
తెలియచేసారు..సంబంధిత భాద్యత కలిగిన జిల్లా అధికారులు ఇట్టి భూమిని డిజిటల్ సర్వే చేసి 3.24 ఎకరాలు హద్దులు కేటాయించి స్మశానవాటికను పరిరక్షించి ఖబ్జా నుండి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు..