Breaking News

రాజీవ్ గృహకల్ప కాలనీకి బస్సు సౌకర్యార్థం రూట్ మ్యాప్ పరిశీలన

మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ నియోజక వర్గం

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీ ప్రజలు మరియు విద్యార్థులు సుధీర ప్రాంతాలకు వెళ్లందుకు రాజీవ్ గృహకల్ప కాలనీకి బస్సు సౌకర్యం లేకపోవడంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి సంప్రదించగా వారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. గత నాలుగైదు రోజులుగా పర్యవేక్షణ చేయగా శనివారం కూకట్ పల్లి డిపో మేనేజర్, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి తో కలిసి రాజీవ్ నగర్ ప్రాంతంలో పర్యటించి బస్సు రూట్ మ్యాప్ పరిశీలించడం జరిగింది. బస్సు ఆసౌకర్యానికి గురికాకుండా రోడ్లపై ఉన్నటువంటి ఫుట్ పాత్ ను, రాళ్ళను వెంటనే హనుమంత్ రెడ్డి చొరవతో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మేనేజర్ సంప్రదింపులు జరిపి వెంటనే జెసిబి తో రోడ్డు పనులు బాగు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రనాయక్ పితాని శ్రీనివాస్, లక్ష్మణ్, సరితా రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బాలకృష్ణ, ఉషారాణి, కిరణ్ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు.