Breaking News

తెలంగాణ లో ప్రతి జిల్లా నుండి ఒకర్నీ కలెక్టర్ చేయడమే నా లక్ష్యం.

మన ప్రగతి న్యూస్ /తలమడుగు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

ఎవరు ఏమైపోతే నాకెంటీ నేను నా బిడ్డలు బాగుంటే చాలు అనే ఉద్దేశం తో కాలం గడుపుతున్న రోజులు ఇవి.ఇటువంటి సమయం లో జైనథ్ మండల కేంద్రానికి చెందిన సూరం పొచ్చన్న అనే ఇంగ్లీష్ ఉపాధ్యాయు డు పేద విద్యార్థులు చదువు కు దూరం కాకూడదు అనే ఉద్దేశం తో దళిత బహుజన విద్యార్థుల కోసం ప్రతి రోజు సంక్షేమ వసతి గృహల్లో సాయంత్రం సమయాల్లో విద్యర్థులకు స్పోకెన్ ఇంగ్లీష్. అలాగే విద్య ర్థులకు సబ్జెక్టు విషయాల్లో అనుమానాలు ఉంటే వాటి సమస్య కు పరిస్కారం చూపించి పొచ్చన్న సార్ మంచి సార్. మాకు ఈసార్ మాత్రమే కావాలి వేరే సార్ వద్దు అనే రకంగా విద్యర్థులకు బోధన చేస్తున్నారు.ఈ సందర్బంగా ఇంగ్లీష్ ఉపాధ్యయూడు సూరం పొచ్చన్న మాట్లాడుతూ నాకు విద్యార్థులు అంటే చాలా ఇష్టం. విద్యార్థులు అందరు నాకు సమానమే నాకు ఎటువంటి కుల మత బేధాలు లేవు తెలంగాణ లో ఉన్న 33జిల్లాల్లో ప్రతి జిల్లా నుండి ఒక విద్యార్థి ని కలెక్టర్ గా చేయడమే నా లక్ష్యం అని అన్నారు.భవిష్యత్తు లో ప్రభుత్వం తరపున విద్యార్థుల కోసం ఏమైనా సహాయ సహకారాలు అందిస్తే నా వంతు ఉచిత విద్య బోధన చేయడానికి నేను సిద్ధం అని అన్నారు.