బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

దమ్మపేటలో మూడు ఇసుక లారీలను పట్టుకున్న పోలీసులు

మన ప్రగతి న్యూస్/ దమ్మపేట:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, మందలపల్లి క్రాస్ రోడ్డు మీదుగా ఆంధ్ర ప్రాంతం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్న మూడు ఇసుక లారీలను శనివారం ఉదయం ఏడు గంటలకు తనిఖీలు నిర్వహిస్తున్న దమ్మపేట పిఎస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బాలస్వామి నాదం పట్టుకొని ఇసుక లారీలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ ఇసుక లారీలు కొవ్వూరు ర్యాంపు నుండి జంగారెడ్డిగూడెం మీదుగా అశ్వరావుపేట నుండి ఖమ్మం వైపు వెళుతుండగా పట్టుకున్నట్లు వివరించారు. పోలీసులు తెలిపిన ప్రకారంగా శనివారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రిప్పర్ల డ్రైవర్లైన గుర్రాల కృష్ణారెడ్డి, బంక వెంకటేశ్వరరావు, బంక ఉదయ్ కుమార్ లను, మూడు టిప్పర్లలో ఇసుక తరలిస్తున్న నిందితుడు కంతేటి త్రినీల్ కుమార్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఒక్కో టిప్పర్ లో 35 టన్నుల ఇసుక చొప్పున 3 టిప్పర్లలో 105 టన్నుల ఇసుకను తరలిస్తున్నట్లు, దీని విలువ సుమారు ఒక లక్ష ఐదు వేల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతటి వారైనా చట్ట విరుద్ధంగా ఇసుకతోలకాలు చేపట్టినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు