- ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు..
మన ప్రగతి న్యూస్/నడికూడ:
రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆత్మ గౌరవా న్ని పెంచే లక్ష్యంతో.. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని నర్సక్కపల్లి గ్రామంలో పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు.. మహిళా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్ మరియు నర్సక్కపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ బుర్ర దీప- దేవేం దర్ గౌడ్ లు పంపిణీ చేశారు. ఈ సంద ర్బంగా వారు మాట్లాడుతూ..18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీర అందించాల నే ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఈ కార్య క్రమం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపా రు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి వి మహిళల పేరుతోనే మంజూరు చేస్తు న్నారని, వారి అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యతను కల్పిస్తుందని వారు అన్నా రు. అర్హులైన వారందరికీ చీరల పంపిణీ జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్య క్రమంలో ఎంపీడీవో రామ రామకృష్ణ, ఎంఈఓ. నాగేశ్వ ర్ రావు, మహిళా సం ఘం సభ్యులు, సిఏ లావణ్య రెడ్డి, మరి యు వివో ఓబి అధ్యక్షురాలు స్వరూప, సభ్యులు పాడి ప్రవళిక, ముంజ రమ, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు జుంక జువ్వ కుమారస్వామి, కోశాధికారి తలగంప రాజు, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు గుర్రాల సాంబరెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు బుర్ర సురేందర్, తిప్పర్తి తిరుపతి రెడ్డి, సుష్మిత, ఆవుల సుమన్, మరియు స్థానిక మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

