6 కోట్ల 73 లక్షల వడ్డీరేని రుణాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
ఉపాధి కల్పన కోసమే వనిత క్యాంటీన్ల ఏర్పాటు
మనప్రగతిన్యూస్/ పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:
మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఐకెపి భవనం వద్దా ఏర్పాటు చేసిన నియోజకవర్గం మహిళా సంఘాల సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే యశిస్వినిరెడ్డి హాజరై రాష్ట్ర ప్రభుత్వం మహిళ స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను నియోజకవర్గంలోని 2410 సంఘాలకు సుమారు 6 కోట్ల 73 లక్షల రుణాల చెక్కులను అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
మహిళలను వ్యాపారవేత్తలుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అంతకుముందు మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి వనిత టీ స్టాల్ ను డి ఆర్ డి ఓ పి డి వసంత తో కలిసి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ వ్యాపారంలో మహిళలు సమాజానికి ఆదర్శంగా ఉండాలని సూచించారు. మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ప్రతి మహిళను వ్యాపార వేత్తలుగా, కోటీశ్వరులుగా చేయాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి ధ్యేయమన్నారు. వనరులను సమకూర్చే రంగాలను మహిళలకే అప్పగిస్తూ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో పాటు 500 కే గ్యాస్ సిలిండర్, విద్యుత్ అవసరాలకు గృహజ్యోతి, పావలా వడ్డీ రుణాలను తోపాటు కోటి మంది మహిళలకు చీరలను అందించామని తెలిపారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు. సోలార్ ప్రాజెక్టులను మహిళా సంఘాలకే కేటాయించామని, ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ, పెట్రోల్ పంపులు, రైస్ మిల్లులు, ధాన్యం నిల్వలకు గోదాములు, ఫంక్షన్ హాల్స్ మహిళలకే ప్రజా ప్రభుత్వం మండల సమైక్యలకు నిర్వహణ అవకాశం ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. మహిళలు వ్యాపార రంగంలో అభివృద్ధి చెంది, పారిశ్రామికవేత్తలుగా ఎదిగి సమాజానికి ఆదర్శంగా ఉండాలని సూచించారు. రుణాలు తీసుకున్న డ్వాక్రా మహిళలు ప్రమాదవశాత్తు మరణిస్తే మహిళ సభ్యులకు కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ప్రమాద బీమా, లోను బీమా కలిపి మొత్తం 12 లక్షలు అందిస్తుందని తెలిపారు. మహిళలు తయారుచేసిన వస్తువులను, కుటీర పరిశ్రమల ద్వారా తయారుచేసిన వస్తువులను, తెలంగాణ వంటలను అమ్ముకునేందుకు వీలుగా ప్రభుత్వం హైదరాబాదులో గల హైటెక్ సిటీ శిల్పారామం వద్ద రెండెకరాల స్థలాన్ని కేటాయించి మహిళా సమాజానికి స్ఫూర్తిగా నిలిచిందని తెలిపారు. మహిళలు వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలకు ఎదిగినప్పుడే ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలకు సార్ధకత ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాలకుర్తి, కొడకండ్ల మండలాల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావుడియా మంజుల, నల్ల ఆండాలు, ఏపీడి నూరొద్దీ, తహసిల్దార్ సరస్వతి, ఎంపీడీవో వేదవతి , పాలకుర్తి,కొడ కండ్ల, దేవరుప్పుల, తొర్రూరు, రాయపర్తి, పెద్దవంగర మండలాల ఏపీఎం శ్రీరాముల చంద్రశేఖర్, పి.నరసయ్య, సత్యనారాయణ, సునీత, రవికుమార్, మహబూబ్ పాషా మండల సమైక్య అధ్యక్షురాలు గునిగంటి భాగ్యలక్ష్మి, కార్యదర్శి గాదరి ప్రమీల, కోశాధికారి బేజాడి సుమలత, సీసీలు కే వెంకటేశ్వర్లు, అనురాధ, శోభ, యాదగిరి, వెంకటయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, దేవస్థాన మాజీ చైర్మన్ చిలువేరు కృష్ణమూర్తి, పాలకుర్తి సొసైటీ మాజీ చైర్మన్ వీరమనేని యాకాంతరావు లతోపాటు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల మండల అధ్యక్షులు మణేమ్మ, భాస్కర్, హరీష్, నాయకులు ములుగురి యాకయ్య గౌడ్, రమేష్, భాస్కర్, నాగన్న తదితరులు పాల్గొన్నారు.



